ఇక పై ఆదాయమే ఆదాయం! 1 m ago
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘యూట్యూబ్’ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేట్ చేసే వల ఆదాయాన్ని పెంచే దిశగా 'షాపింగ్ ప్రోగ్రామ్' ను ప్రారంభించారు. దానితో అర్హులైన క్రియేటర్లు తమ వీడియోలు, షార్ట్‌లు సహా లైవ్ స్ట్రీమ్‌లలో ఉత్పత్తులను ట్యాగ్ చేసి.. ఆదాయాన్ని సంపాదించవచ్చు. దీనికోసం ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, మింత్రాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూట్యూబ్ ప్రచారం చేస్తుంది. షాపింగ్ ప్రోగ్రామ్ని దక్షిణ కొరియా, అమెరికా లాంటి దేశాల్లో యూట్యూబ్ గతంలోనే అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని మరిన్ని దేశాలకు విస్తృతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా భారత్‌లో లాంచ్ చేసింది. షాపింగ్ ప్రోగ్రామ్ ఫీచర్‌ని ఎనేబుల్ చేసుకొనేందుకు వీడియో క్రియేటర్లు ముందుగా యూట్యూబ్ షాపింగ్‌లో సైనప్ అవ్వాలి. మీ అప్లికేషన్ ఆమోదం పొందాక ఈ సదుపాయాన్ని పొందొచ్చు. అప్లోడింగ్ చేసే వీడియోలు, షార్ట్‌లు, లైవ్ స్ట్రీమ్‌లు ఉత్పత్తులను ట్యాగ్ చేయొచ్చు. యూజర్లు పక్కనే ఉన్న షాపింగ్ సింబల్‌పై క్లిక్ చేస్తే.. ఆ ప్రొడక్ట్ వివరాలు కనిపిస్తాయి. వేరే బ్రౌజర్ ఫేజు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి. నచ్చిన ప్రొడక్ట్స్‌ను పిన్ కూడా చేసుకోవచ్చు.